ఈవెంట్స్
భవిష్యత్తులో చేయబోయేది
-
శ్రీ అమ్మవారి పేరిట జగత్కళ్యాణం అనే పేరుతో పీఠమును స్థాపించుటకు సంకల్పం.
-
శ్రీ అమ్మవారి పేరిట సంకీర్తనలు ఉచితంగా నేర్పించే సంకీర్తన శిక్షణా శిబిరం.
ఇప్పటి వరకు జరిగినవి
-
శ్రీ కనక మహాలక్మి అమ్మవారి చరిత్ర గ్రందావిష్కరణ సభ పబ్లిక్ లైబ్రెరీ [బి వి కె కాలేజీ అపోజిట్ ] లో జరిగింది.
ముఖ్య అతిధులు :
ఆంధ్ర విశ్వవిద్యాలయం అప్పటి ఉపకులపతి శ్రీ రాజు గారు, మరియు నాగార్జున యూనివర్సిటీ విశ్రాంత ఉపకులపతి శ్రీ బాల మోహన్ దాసు గారు, ప్రముఖ సాహీతీ విమర్సకులు ఆచార్య దామెర వెంకట సూర్యరావు గారు, స్.కె.మ.అల్ ఆలయం ఇఓ గారు శ్రీమతి స్. జ్యోతి మేడం గారు.
-
2015 లో శ్రీ అమ్మవారి మీద రచించబడిన లఘు సంకీర్తన పుస్తకం (116 సంకీర్తనలు) పుస్తకం ఆవిష్కరణ సభ. ఆలయ కళావేదిక మీద జరిగింది.
ముఖ్య అతిధులు :
శ్రీ సాయినాథ పీఠాధిపతి ( ఎంవీపీ కాలనీ ) పూర్ణానందస్వామిజీ మరియు SKML ట్రస్ట్ సభ్యులు.
-
2016 లో శ్రీ అమ్మవారిపై 1116 సంకీర్తనలు అవధాన సంచిక ఆవిష్కరణ సభ.
ముఖ్య అతిధులు :
కుర్తాలం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సిద్దేశ్వరానంద భారతి మహా స్వామి గారు.
-
2016 శ్రీ కనక మహాలక్మి అమ్మవారు వెలసిన ప్రదేశాలకు స్వయంగ వెళ్లి ఆయా ప్రదేశాలకు దృశ్య మాధ్యమంగా (సీడ్) చిత్రీకరించిన ఆవిష్కరణ సభ.
ముఖ్య అతిధులు :
శ్రీమాన్ చిలకపాటి విజయ రాఘవాచార్యులు వారు (దేవాదాయశాఖ), సీత డైరెక్టర్స్.
-
2017 నుంచి నేటివరకు ప్రతీ సంవత్సరం సంకీర్తన అవధాన సభగా పుస్కరించుకొని ప్రతీ ఏటా వివిధ గాయకులచే మరియు అన్నమాచార్య ట్రస్టు ( టి టి డి ) గాయకులచే యూట్యూబ్ ద్వారా పలు కార్యక్రమాలు, సంకీర్తనలు ప్రచారం.
-
2020 నుంచి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి పేరిట అమ్మవారి వ్రతాలను ప్రారాభం చేసి ఆన్లైన్ ద్వారా మరియు ఇళ్ల దగ్గర ధారావాహికంగా వ్రత కార్యక్రమాలు జరుగుచున్నవి.
-
2019 లో శ్రీ అమ్మవారి చరిత్ర లో దాగి ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి చరిత్ర యోగ రహస్యము అను గ్రంధావిష్కరణ శ్రీ లలితా పీఠంలో జరిగింది. (అక్కయ్యపాలెం).