
భక్తి ఛానల్ చరిత్ర
ఉత్తరాంధ్ర ఇలవేల్పు, అయిన శ్రీ కనకమహాలక్ష్మి చరిత్ర మరియు మహత్యం చాలా మందికి తెలియకపోవడం బహుశా ఆ తల్లి అనుజ్ఞ లేకపోవడమే కారణమని డైవజ్ఞులు విశ్వాసం.
అటువంటి అమ్మవారి చరిత్ర కేవలం సిద్దపురుషులకు మాత్రమే అవగతమై ఉండుట, ఆ చరిత్ర బయటకు రావడానికి తగిన సమయం, ఉపాధి లభ్యం కావడం ముఖ్యమైన అంశం. విశాఖపట్నం లో ఉన్న అనేకమంది సాధకులలో ఒకరైన శ్రీ మంగిపూడి శివరామకృష్ణ మూర్తి గారు ఒకరు. అయన ద్వారా శ్రీమాన్ కొరుపోలు వెంకటరావు గారు గురూజీని దైవికంగా కలవటం, అయన ఈ అమ్మవారి చరిత్ర మూకీగా చెప్పడం, ఈ చరిత్రను రాసిన పిదప, ఒక సద్గురును అనుమతితో జన బాహుళ్యం లోకి తీసుకోని రావాల్సి ఉంటుందని అయన (గురువు) ఆదేశించటం జరిగింది.
2004 లో జరిగిన ఈ సంఘటన మొదలు, శ్రీమాన్ కొరుపోలు వెంకటరావు గారు, అనేకమంది పీఠాధిపతులును కలిసి, చరిత్రపై చర్చించి, 2014 వరకు ఆధ్యాత్మికత పరిశోధన జరిపి పుస్తకరూపం తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలోనే జద్గురు, శంకరాచార్య పరివ్రాజక చార్య శ్రీ శ్రీ శ్రీ సిద్దేశ్వరానంద భారతి స్వామి వారు వెంకటరావు గారి కలలో కనిపించి మంత్రోపదేశం చేయడం జరిగింది. తదుపరి ఈ అమ్మవారి చరిత్ర గ్రంధాన్ని గురువుగారికి అంకితం ఇవ్వటం, ఆ గ్రంధాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆర్ధిక సహాయం అందించి జనబాహుళ్యం లోకి తీసుకురావడం జరిగింది
2016 సం ” లో శ్రీ వెంకటరావు గారు 40 రోజులు అమ్మవారి పీఠాన్ని ఏర్పరచి, పదకవితా పితామహులైన శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు వారి సంప్రదాయంలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి పై పదకవితా సంకీర్తనలు అవధాన ప్రక్రియ ద్వారా ౩౦ రోజులలో 1116 సంకీర్తనలు రచించడం జరిగింది. ఈ పుస్తక ఆవిష్కరణ సందర్భగా దేవాదాయశాఖ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు డైరెక్టర్ శ్రీమాన్ చిలకపాటి విజయ రాఘవాచార్యులు వారు శ్రీ వెంకటరావు గారికి “కనక వెంకట దాసు ” అను బిరుదును ప్రధానం చేసారు. అదేవిదంగా తాళ్ళపాక వారి వంశీయులు అన్నమాచార్యులు వారి 12 వ తరం శ్రీమాన్ తాళ్ళపాక హరినారాయణ చార్యులు వారు శ్రీ వెంకటరావు గారికి “అపర అన్నమయ్య” అను బిరుదును ప్రధానం చేసారు.
ప్రస్తుతం శ్రీ వెంకటరావు గారు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు జిల్లా సమాన్వయ కర్తగా వ్యవహరిస్తూ, శ్రీ కనక మహాలక్మి అమ్మవారి దేవస్థానం లో ఉద్యోగిగా ఉంటూ తన సొంత సేవ సంస్థ అయిన స్ కే ఎం వి సి [ శ్రీ కోరుకోలు ముత్యాలమ్మ వెంకటస్వామి చారిటబుల్ ట్రస్ట్] ద్వారా తన సొంత నిధులలో శ్రీ అమ్మవారి ఆలయ చరిత్ర వైభవం కొరకు విశేష కృషి చేయుచున్నారు. శ్రీ వెంకట రావుగారికి రాజయోగి, సాధకుడు అని ఆధ్యాత్మిక వర్గాలలో గుర్తింపు కలదు.